పూల తోటి వస్తినయా శంకరా…

పూల తోటి వస్తినయా శంకరా…
బిల్వ దళములనే తెస్తినయా శంకరా…
పాల తోటి వస్తినయా శంకరా…
నీకు సేవ చేయవస్తినయా శంకరా….శంకరా…!!పూల!!

మంచుకొండ లాగా నీ మనసు చల్లన…
మాకు వరములిచ్చు దేవా నీ కాళ్లు మొక్కనా..
కరుణచూపు హృదయం నీదేర మల్లనా…
నిలబెట్టరార శివా..మా బ్రతుకు నిచ్చెన…
వెనకడుగులు వేయకుండా సాగిపోతుము…
నీ అడుగులకు మడుగులొత్తి పొంగిపోతుము…!!పూల!!

చేయకున్న భక్తితో నీదు పూజలు…
ముక్తినిచ్చేవయ శంకరా..నీకు దండాలు…
తెలియకున్న పలుకంగా నీ మంత్రాలు….
నమః శివాయ అంటే చాలు దక్కు వేల వరములు…
ఇలా నీ కరుణకు లొంగిపోయి భక్తులౌతుము….
శివా…నీ ప్రేమకు పొంగిపోయి ధన్యులవుతుము…!!పూల!!

పాహిమాం… పాహిమాం పార్వతీశ పాహిమాం… రక్షమాం రక్షమాం సాంబశివా..రక్షమాం

Leave a Comment

Scroll to Top