ద్వారకాదీశా.. యదునందనా..

ద్వారకాదీశా.. యదునందనా..
వైకుంఠ వాసా.. మధుసూధనా…
అందుకో మానుండి సిరిమల్లె పూజలు…
పుచ్చుకో మానుండి నీ వెన్న ముద్దలు….
కృష్ణా..మురిసేము నీ ప్రేమ తత్వానికి…
చిన్ని కృష్ణా…తడిసేము నీ వేణు గానానికి…!! ద్వార!!

రాధా మనోహరా…గోవిందుడా…
గోపికాలోలుడా గోపాలుడా…
నీ మాయలో పడుదురే ఎవ్వరైనా…
నీ భజనలే చేయుచూ  ఎందరైనా…
నీ నవ్వులే మా ఇంటి నందనవనం…
నీ సేవలో చూసేము బృందావనం…!! ద్వార!!

కారాగారమున పుట్టావు నల్లనయ్య…
వెన్న దొంగగ మారావు చిన్ని కన్నయ్యా….
చిరుప్రాయముననే చూపావు నీ లీలలు…
కృష్ణా… తెరిపించినావు నీవు మా కన్నులు….
దేవకీ సుతునిగా జన్మించిన…
దేవదేవునివి నీవు రుక్మిణీ రమణ…!! ద్వార!!

పాహిమాం పాహిమాం కృష్ణ పరమాత్మ పాహిమాం… రక్షమాం రక్షమాం ధర్మ సంరక్షకాయ రక్షమాం…

Leave a Comment

Scroll to Top