కార్తీక మాసం శివా….
నీవు కరుణించు మాసం శివా..
దీపాలు తెచ్చాం శివా…
దీప హారతులనిచ్చాం శివా..
ఇక కరుణించవయ్యా శివా…
మమ్ము దీవించవయ్యా శివా…!!కా!!
దండాలు ఇవిగో శివా…
పూల దండలను గైకొను శివా…
గండాలు బాపే శివా…
పొర్లు దండాలు పెడతాం శివా…
బిల్వాలు తెచ్చాం శివా…
బిల్వ అర్చనలు చేశాం శివా…!!కా!!
మా దిక్కు నీవే శివా…
మా జన్మపై హక్కు నీదే శివా…
మా శ్వాస నీవే శివా…
శ్వాసించు ఊపిరివి నీవే శివా…
నటియించు పాత్రలం శివా…
మా నటన నిర్దేశకుడివి నీవే శివా…!!కా!!
పాహిమాం…పాహిమాం…శివా…
శివా రక్ష మాం..రక్ష మాం…శివా…