కార్తీక మాసం…కరుణామయుని కరుణకోసం…
పూజించరే శంకరుని తులసి మాలలతో…
ప్రార్థించరే ఈశ్వరుని మనసు కుసుమాలతో…
అభీష్టములు నెరవేర్చు ఆదిశంకరుడు…
మనని ఇష్ట భక్తులుగా భావించు సాంబశివుడు…!!కా!!
విభూది ప్రియుడు విశ్వేశ్వరుండు…
భక్త జన బాంధవుడు భీమేశ్వరుండు…
కంఠాన వున్ననూ కాలకూటం…
కరుణించు తన మనసు పంచామృతం…
చేజాచి అడిగితే ఏదేని వరము…
తక్షణము ఇచ్చుటే శంకరుని గుణము…!!కా!!
ఘోర తపసులు చేసిన మునులనైనా…
యజ్న యాగాదులు చేసిన ఋషుల నైనా…
ప్రశ్నించితే శలవిచ్చు శంకరుని మహిమలు…
వారు బోధించితే తెలియు ఈశ్వరుని లీలలు…
ఆ మహా మహిమాన్వితమైన మహేశ్వరుని కొలవరా…
ప్రభో శివా..శరణు శరణంటూ చరణాల తల వాల్చరా…!!కా!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్ష మాం..