ఓ కాళ లింగమా….

ఓ కాళ లింగమా….
జగమేలు జంగమా….
ఈ సంధ్యవేళలో హారతులను కొనుమా….
అదృశ్య రూపమా…
సదృశ్య భావమా….
మా మనోవేదనలు మనసార వినుమా…
బిల్వ దళ ప్రియుడా… ఆదిశంకరుడా….
బిచ్చమడిగితి నిన్ను భీమశంకరుడా…!! ఓ!!

వేల పరగణముల నేల నాకున్ననూ….
నీ దీవెనలు లేక నేను ఎట్లుందును….
కోట్ల పడగల ఆస్తులెన్నుననూ…
నీ కరుణ లేక జీవచ్చవమవుదును…
నీ చూపు నా పైన పడనివ్వు శంకరా….
అపురూపముగ నిను నేను కొలిచేను ఈశ్వరా….!!ఓ!!

పాహి పాహి అనుటయే నా కర్తవ్యము….
నీ దరికి చేరుటే నా లక్ష్యము…
జన్మాంతమూ కొలుచుటే నా ధర్మము…
ఆత్మనర్పించుటే నాకు పరమపదము…
వేడుకొనుచున్నాను నీ చరణాల చేరి…
అర్థించు చున్నాను నీ దీవెనలు కోరి…!!ఓ!!

పాహిమాం…పాహిమాం… పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top