ఏ రీతిన నిను కొలవను శంభో హర శంకరా…

ఏ రీతిన నిను కొలవను శంభో హర శంకరా…
నిన్నేరీతిన ప్రార్ధించను శలవియ్యుము ఈశ్వరా…
రావు రావు నాకు ఏ అష్టోత్తర పదములు….
తెలియవయ్య నాకు నిను పూజించే విధములు…
నమః శివాయ మంత్రాలే నాకు తెలుసు శంకరా…
శిరము నొంచి మొక్కుటే ప్రార్ధించుననుట తెలుసురా…!!ఏ!!

ఇవ్వగలగ నా దగ్గర ఏమున్నది శంకరా…
ఇస్తుమంటే నీది కానిదేమున్నది ఈశ్వరా….
పాద  పూజ  చేతురా…పార్వతీశ అందుకో…
నీ పద సేవను చేతురా…శాంకరీశ పుచ్చుకో…
తెలుసుకొనుము మనసులోని భక్తి లోతుని….
నీ పద సన్నిధిన ఇవ్వుమయ్యా కాస్త చోటుని…!!ఏ!!

జ్ఞానమివ్వు శంకరా నీ జపము చేసెదా…
సుజ్ఞానమివ్వు హర హరా స్వర రచన చేసెదా….
విద్యనివ్వు ఈశ్వరా విరచిస్తు గీతము…
మంచి స్వరము నివ్వు హర హరా వినిపిస్తు స్తోత్రము…
నాకు వరమునిస్తివంటే..నేనాలపించునటుల….
నీ గీతమాలపించెదా…నీవు పరవశించు నటుల….!!ఏ!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వర పాహిమాం…రక్ష మాం…రక్షమాం…సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top