ఈశా… మహేశా…

ఈశా… మహేశా…
ఎరుగగలమా నీ మాయ మర్మములను…
కాశీ నివాసా…
తెలుసుకొనగలమా నీ లీలా వినోదములను…
ఒక ఇంట జననం…
మరో ఇంట మరణం….
అంతు బట్టని ఈ ఆట ఏమిటోయి…
శివా…అల్పులము మాతోటి ఆడకోయి…!!ఈ!!

పోస్తావు ప్రాణము…
ఒకవైపు వేస్తూనే బంధము…
ఇస్తావు జన్మము…
తీర్చుకొమ్మనుచు ఋణము…
నడిపించెదవు పరమ పద సోపాన పటములో…
తుదకు ఓడించెదవు కర్మఫలములు వేటాడు ఆటలో….!!ఈ!!

ఎవరితరమయా శివా నీ లీలలెరుగ…
శివా…ఏ పాటి వారము మేము నీ అంతరంగమెరుగా…
మనో నిష్ఠను మాకు ప్రసాదించవయ్యా…
నిన్ను సదా ఇష్టపడు భక్తునిగ దీవించవయ్యా…!!ఈ!!


పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం…రక్షమాం సర్వేశ్వర రక్షమాం…

Leave a Comment

Scroll to Top