ఆశీర్వచనములివ్వరా…

ఆశీర్వచనములివ్వరా…
ఓ కాణిపాక మహ దేవరా..
ఆయుర్దాయము నివ్వరా…
ఓ అంబాసుత లంబోదర…
శంభో శంకర గణనాథా…
నా మనవిని ఒక పరి వినరాదా…!!ఆ!!

ఈశ్వర పుత్రా వినవయ్యా….
మమ్మొకపరి దయతో కనవయ్య…
ఎలుకను ఎక్కి రావయ్యా…
మా ఏలిక నీవే గణపయ్య…
శివ శివ శంకర గణనాథా…
దీవింతును మిమ్మని అనరాదా..!!ఆ!!

చేసేమయ్యా పూజలను..
పరికించుమయా మా వినతులను…
ఉంచేమయా ఫలములను…
తిని కావుము చల్లగ జగములను…
ఓ విఘ్నరాజ దిగి రారాదా…
మా పూజలందుకొని పోరాదా…!!ఆ!!

పాహి పాహి గణ నాథా..మాం పాహి పాహి గణనాథా…రక్ష రక్ష గణనాథా…శివ రక్ష రక్షా గణనాథా..

Leave a Comment

Scroll to Top