అణువణువునా ఉన్నావు శివశంకరా…

అణువణువునా ఉన్నావు శివశంకరా…
నీవు ప్రతి మనసులో ఉన్నావు పరమేశ్వరా….
నీడల్లె ఉంటూనే గంగాధరా…
మమ్ములను నడిపిస్తువున్నావు శంభోహరా…
చేయకున్ననూ భక్తితో నీ పూజనీ…
నీవు చూపుచున్నావు మాపైన నీ కరుణని….!!అణు!!

బ్రతుకుతెరువుకే వెచ్చిస్తు మా సమయము…
మాకు బ్రతుకునిచ్చిన నిన్ను మరచి పోతున్నాము…
అట్టహాసముతో గడుపుతూ మా జీవితం…
నీపైన దృష్టి పెట్టలేదనుమాట నగ్న సత్యం…
కనులు తెరిచానయా కరుణాకరా…
నిన్ను తెలుసుకున్నానయ్య నిఖిలేశ్వరా….!! అణు!!

వేదపఠనము నేను చేయలేనయ్యా…
నీ కీర్తి ప్రతిష్ఠలు చదువ సరితూగనయ్యా….
కరుణిస్తే చదివేను లింగాష్టకం…
నీవు వరమిస్తే పలికేను అష్టోత్తరం…
విని పరవిశించాలి నీ మానసం…
నా భక్తి గని ఇవ్వాలి నీ దర్శనం…!! అణు!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం….రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top