జై గణేశ జై గణేశ జై గణేశ దేవా…
మాహాకాయ ఎలుక నెక్కి మమ్ము కావ రావా…
శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రావా…
మా పూజలందు కొన ఇలకు వెనువెంటనే రావా…!!జై!!
పట్టు పంచె తెచ్చినాము కట్టుకొన రారా…
లేత ఊదారంగు ఉత్తరీయం భుజాన వేసుకోరా…
గణపతీ… నువ్వొచ్చి పూజలందుకుంటే…..
సిద్ధి గణపతి… మేమిచ్చే మా లడ్డులందుకుంటే…
అదే కదా గణపతి చవితి పండగ…
నువ్వు సదా ఇవ్వుమయ్యా వరాలు దండిగా…!!జై!!
వెలగ పళ్ళు,అరటి పళ్ళు నీకు తెచ్చినాము…
మాంచి తీయనైన కుడుములను చేసుకొచ్చినాము…
ఆరగించు గణపతి అర నిముషంలో….
మమ్ము దీవించుము గణపతి మరునిముషం లో…!!జై!!
పాహిమాం…పాహిమాం…గణ నాయక పాహిమాం…రక్ష మాం..రక్ష మాం.. శుభదాయక రక్షమాం…