బజ్జోరా బజ్జోరా గణపతి ..

బజ్జోరా బజ్జోరా గణపతి ..
అలసి సొలసినావు పూజలకు గణపతి…
నిదరోరా నిదరోరా గణపతి…
డోలు భాజాలను ఆపినాము గణపతి…
విశ్రమించవయ్యా గణ నాయకా…
తిరిగి ఉపక్రమించవయ్యా వరమియ్యగా…!!బ!!

చల్లంగా నీవుంటే గణపతి…
మేము నిర్మలముగా వుంటాము గణపతి…
సంతసమున నువ్వుంటే గణపతి…
పూలు చల్లంగ మేముంటిమి గణపతి….
పాలుపోదు గణపతి నీ పాట పాడకున్న..
మనసు ఊరుకోదు గణపతి.. చిందేయ కదలకున్న…!!బ!!

మా అండవై నీవుంటే గణపతి…
ఏ కొండ నైన ఢీ కొడతాం గణపతి…
బుద్ధి బలమే నువ్వైతే సిద్ధి గణపతి..
జ్ఞాన ఫలములనే పొందమా సుజ్ఞాన గణపతి…
సాలుకొక్కసారి కరుణించ ఇలకు వచ్చి….
తరలెళ్లి పోతువయ్యా నీ జ్ఞాపకాలనిచ్చి…!!బ!!

పాహి పాహి గణనాథా..పాహి పాహిమాం….రక్ష రక్ష గణనాథా రక్ష రక్షమాం…

Leave a Comment

Scroll to Top