ఒకే ఒక్క దేవుడండి వక్రతుండుడు…

ఒకే ఒక్క దేవుడండి వక్రతుండుడు…
మనకు కానరాడు జగములందు ఇలాంటి ఒక్కడు….
వరపుత్రుడు పార్వతికి విఘ్నేశ్వరుడు….
ప్రేమ ప్రియ పుత్రుడు శంభునికి మహాకాయుడు…
గణేశా గణేశా గంగాధర గణేశా… గణేశా గణేశా గౌరీపుత్ర గణేశా…!!ఒకే!!

గణములకే అధిపతిగా నియమించెను శివుడు…
విఘ్నాలను ఎదురించే వరమిచ్చెను హరుడు…
గణనాథా నీచరితను వ్రాయ సాధ్యమవునా…
శంభు గణనాథా నీఘనతను నిర్వచించగలనా…
గణేశా గణేశా శంభు గణేశా…
గణేశా గణేశా గౌరీ సుత  గణేశా..!!

నిన్ను చూసి నవ్వేనంట నింగినున్న   సోముడు…
తల్లి పార్వతమ్మ శాపమునకు మన్నించమనె చంద్రుడు…
తల్లి ప్రేమ ఎట్లుంటదో తెలుసుకుంటి గణేశా…
ఆ తల్లి మనసు గొప్పేంటో అర్థమాయే గణేశా…
గణేశా గణేశా గంగాధర గణేశా…
గణేశా గణేశా శంభో హర గణేశా…!!ఒకే!!

పాహి పాహి గణేశా…మాం పాహి పాహి గణేశా…

Leave a Comment

Scroll to Top