మాధవుడు మహేశ్వరుడు ఒక్కటనే తెలుసుకో…
వారి అంతరాత్మలొక్కటనే సత్యమునే తెలుసుకో…
చూపించును చూపు..రెండు కళ్ళూ ఒక్కటై…
అలా కరుణించును మనని వారిద్దరూ ఒక్కటై…
నారాయణ..నారాయణ నమో లక్ష్మి హృదయా…
నమఃశివాయ..నమః శివాయ ప్రభో గౌరి మది నిలయ…!!మా!!
శివుని మనసు వెన్నంట…
కేశవుని మనసు జున్నంట…
కరిగి పోయి కరుణించే తత్వమొకరిది…
తీయనైన ప్రేమ చూపు మనస్తత్వమొకరిది…
దయామయులే ఇద్దరూ దీన జనులకు…
వారు కరుణ చూపు దైవాలే భక్త జనులకు….!!మా!!
వల్లకాడు ఇల్లంట సాంబమూర్తికి…
ఆ వైకుంఠమే ఇల్లంట విష్ణుమూర్తికి…
శివుడు కాలిపోయే జన్మలను ఊరడించును….
తనని చేరుకునే ఆత్మలకు శ్రీ హరి ముక్తి నొసగును…
ఇలా వారిద్దరు ఒక్కటై మోక్షమిత్తురు…
మన కర్మలు తీరకుంటే మరుజన్మనిత్తురు…!!మా!!
పాహిమాం…పాహిమాం…శివ కేశవ పాహిమాం…రక్ష మాం..రక్ష మాం..హర మాధవ రక్షమాం…