ఈశ్వరా…నీ పూజతో నా దినచర్య మొదలవ్వనీ…
పరమేశ్వరా..నీ సేవతో ఆ రోజు పూర్తవ్వనీ…
ఇలా ప్రతి రోజు నీ పూజ వ్రతమవ్వనీ…
అలా వరమిచ్చి ఈ జన్మ నీ పరమవ్వనీ…!!ఈ!!
శివా..నాలోని స్వార్థమను రక్కసిని సంహరించు…
హరా…దాగున్న మోహమను భూతమును అంతమొందించు..
నిష్కల్మష మైన మనసుతో నిను కొలుచునట్లు…
పుష్కలమగు భక్తితో పూజించునట్లు…
కార్యోన్ముఖుడిని కానివ్వు కాత్యాయనీ పతి…
నీ వ్రత దీక్షా పరుడిని కానివ్వు గౌరీ పతి…!!ఈ!!
శివా…ఈ జన్మ నీ వరము తండ్రీ…
హరా…ఈ ప్రాణము నీదే కదా తండ్రీ…
చేయించుకో నా చేత వేల పూజలను…
వ్రాయించుకో నా చేత లక్ష గీతాలను…
అడిగిందే తడవుగా వరమిచ్చు శివశంకరా…
నేనడిగింది ఇదొక్కటే మన్నించి వరమివ్వు పరమేశ్వరా…!!ఈ!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్షమాం