కలియుగ దైవమా…
కాళేశ్వర లింగమా…
పేర్లు వేరైన మీ దారులొకటే…
రూపు వేరైన మీ మనసులొకటే…
భక్తులను కాపాడటం మీ సహజ గుణము…
అశక్తులను ఆదుకొనడం మీ ప్రేమ గుణము…!!, కలి!!
సువిశాల హృదయములు కలవారు మీరు…
పూర్ణ కలశాల పూజలకే పరవశించేరు…
లోక సంరక్షణకై పడుదురు పడరాని కష్టము…
సృష్టి మనుగడకై చేసేరు ఎంతైన త్యాగము…!!కలి!!
వెనుకాడరే రక్షింప ఏ ప్రాణినైననూ…
మీరు కదిలొస్తురే పిలిచితే ఏ క్షణమునైననూ…
అలా కాపాడుతూ కరుణించు మీ ఇద్దరినీ…
ఎలా పూజించితే తీర్చగలము మీ ఋణముని…
కేశవా…పవళిస్తే పాదాలు ఒత్తుముము మేము….
శంకరా…కరుణిస్తే నీ కాలి అందెలవుతుము మేము…!!కలి!!
పాహిమాం…పాహిమాం..శివ కేశవా శివా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం..హరి మాధవా హరి రక్ష మాం..