సంగమం…సంగమం…

సంగమం…సంగమం…
శివ పార్వతుల అనురాగ సంగమం…
సరాగం.. సరాగం…
పార్వతీ పరమేశ్వరుల ప్రణయ సరాగం….
సృష్టికర్తలిద్దరూ ఒక మేనిలో….
సమ్మిళితమయ్యారు చిరునగవులో…!!సంగమం!!

జగత్ పాలక జంగమా… కంటిరా ఓవైపు మా తల్లి ఉమని….
హిమపుత్రి స్నేహమా లింగమా… కనుగొంటిరా నీ పైన తనకున్న ప్రేమని…
నీలోన సగమయ్యి మా తల్లి పరవశించె…
మనసారా ఏకమై తనని నీకు అర్పించె…
ప్రణయ కావ్యాలు రచయిస్తూ మీ ఇద్దరూ…
ప్రేమ ప్రబంధాలనివ్వండి లోకానికి మీ ఇరువురు…!!సంగమం!!

ఆనంద రూపిణీ శివాని.. అందుకుంటుంటే నీవు మాశివుని మనసుని….
అనురాగ వర్షిణీ భవానీ… పంచుకుంటుంటే మా హరునితో నీ ప్రేమని….
పులకించె నా తల్లి సృష్టి యావత్తూ…
నిర్మలముగా నిదురించు నా తల్లి జగతి యావత్తూ…
అర్ధనారీశ్వరుడై శివుడు అలరారుచుండగా….
ఆనంద గీతికలు పాడవా తల్లి… కోయిలలు దండిగా….!!సంగమం!!

పాహిమాం పాహిమాం పార్వతీ పరమేశ్వర పాహిమాం… రక్షమామ్ రక్షమాం గౌరీ మహేశ్వర రక్షమాం..

Leave a Comment

Scroll to Top