ధవళా చల దయాకరుడు కనికరించెరా….
అలా హిమాచలము నుండి ఇలకు కదలి వచ్చెరా….
కాంతులీను కనులతో….
ప్రసన్నమవ్వు నగవుతో..
దీన జనుల కావగా…
తను పిలుచు చుండె ప్రేమగా….!! ధ!!
మంగళకర రూపమంటే మహా శివునిదే…
శుభ మంగళకర వదనమంటే సాంబశివునిదే…
చింత తీర్చు సుగుణమంటే శంకరయ్యదే….
మనపై కరుణ చూపు హృదయమంటే ఈశ్వరయ్యదే…
సాగిలపడి వేడు నీ భారమతనిదే …
నువ్వు మోకరిల్లి చూడు నీ సర్వమతనిదే…!! ధ!!
స్వచ్ఛమైన త్యాగమంటే ధ్యానయోగిదే…
పరిపూర్ణమైన యోగమంటే ఆది యోగిదే…
సృష్టిలోన అందమంటే పరమశివునిదే…
భక్త జనకోటికి హృదయమంటే సదాశివునిదే…
మనసు పెట్టి చూడు నీ జన్మ అతనిదే…
శోధించి తరచి చూడు నీ ప్రాణమతనిదే…!!ధ!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమామ్…