తరలి రావా…బిల్వ దళ వనములెన్నైననూ…

తరలి రావా…బిల్వ దళ వనములెన్నైననూ…
శివా… కదలి రావా.. నీ పూజకు ఎచ్చోట వున్ననూ…
నీ సేవకే వెలిసింది  మారేడు దళము…
అది నిను పూజించ మాకయ్యే దైవాంశ వృక్షము…
త్రిదళ సేవ ప్రియా శివా..గంగాధరా…
నిన్ను త్రిసంధ్యలూ కొలుచు వరము మాకియ్యరా…..!!తరలి!!

పరిమళముల నివ్వవూ ఆ రెమ్మలు…
రుచికి మధురముగా నుండవూ ఆ దళములు…
అవి నీకెట్లు ముదమాయే శివ శంకరా…
నీ లీల అర్థమే కాదు మాకు పరమేశ్వరా…!!తరలి!!

విస్తారముగా పండించు ఆ వనములు….
బహు విశేషముగా చేసేము నీ పూజలు….
కరుణించి ఇస్తివో మాకొక్క వరము…
శివా…అడిగేమో ఇమ్మనుచు బిల్వదళ జన్మము…
కష్ట సాధ్యము కాదు నీకు కరుణామయా…
వరమిస్తె…నీ ఇష్టదళమును నేనౌతు శర్వాణి హృదయా….!!తరలి!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం….

Leave a Comment

Scroll to Top