పరుగు పరుగున రారండి భక్తులారా…
అర్ధ నారీశ్వరుని కనగ ఆర్తులారా…
రాదంట మనకింక ఏ కష్టము…
కనిన మేలంట మన జన్మ ఆసాంతము…
పరమ పావనమైన పార్వతీ విభుడు…
సగమేను హిమపుత్రి రూపుడై కలలు పండించినాడు…!!పరుగు!!
చూడ చక్కనీ జంట అట ఆది దంపతులు…
భక్త మానస సిరులంట ఉమా మహేశ్వరులు…
ఏక మేనీ రూపుడై ఏకాంబరేశుడు…
కామాక్షీ సతితోడ కాత్యాయనీ విభుడు…
ఇచ్చుచుంటే భక్తులకు శుభ దర్శనం…
మన ఇంట పెరిగి పోదా వారిద్దరి కరుణల వనం…!!పరుగు!!
అనురాగ మధురిమల సురుచులను తెలుప…
ప్రేమానుబంధాల విలువలను తెలుప…
పార్వతీ పరమేశ్వరులు కుడి ఎడమలై…
స్త్రీ పురుష సాంగత్య పరిపూర్ణులై…
అలరారు చున్నారు గుడి యందున…
ప్రియమారా విహరించ నున్నారు మన మనసున…!!పరుగు!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం…. రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్షమాం…