అత్యంత సుందరా శివ శంకరా…
అపర్ణా పతీ శివా…గంగాధరా….
బిల్వ దళ ప్రియ భీమేశ్వరా…
భస్మ అభిషేక ప్రియ కాళేశ్వరా…
జన్మ దాసోహమంటోంది నిను కనిన పిదప….
తెప్పరిల్లలేకుంది ఇంకనూ నా కంటి పాప…!!అత్యంత!!
శివా….ఆకట్టు కుంటావు నీవు మాయలను చేసి…
హరా…రాబట్టుకుంటావు మమ్ము నీ గుడులకేసి…
ఆకట్టుకొనుటలో ఉన్న అంతరార్థమును…
రాబట్టుకొనుటలో ఉన్న పరమార్థములను…
ఎరుగకుంటిమయా మేము వెండి కొండలవాడా…
నీ మాయ మర్మాలు తెలియ సాధ్యమా సాంబ శివుడా…!!అత్యంత!!
శివా…నీ తత్వము తెలుపుటకు ఆకట్టు కుంటావట…
హరా… దీవెనలనిచ్చుటకు రాబట్టు కుంటావట…
ఆకట్టు కొనుటలో దాగుంది అమరత్వము…
రాబట్టు కొనుటలో తెలిసింది నీ ప్రేమ తత్వము…
వర్ణించ వీలవునా నీ ప్రేమ పరంపరలను….
విరచించ తరమా నీ కరుణ తరంగములను…!!అత్యంత!!
పాహిమాం… పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం..