కొలువైతివా కౌసల్య తనయా…

కొలువైతివా కౌసల్య తనయా…
కాళ లింగమున శ్రీ జానకీ హృదయా…
అలనాడు చేశావు నీవు శివుని పూజ…
నేడు చేయుచున్నాము మేము నీకు పూజ….
రామా…కాళలింగేశ్వరుని మనసులో చేరినావా…
శ్రీరామ… రామలింగేశ్వరునివై కరుణించ వచ్చినావా…!! కొలు!!

ఎంత దయామయుడో మా సాంబశివుడు….
అంత సుగుణామయునివై నీవు కరుణింతువెపుడూ….
ఇంకెంత భక్త జన ప్రియుడో మా ఆది శంకరుడు….
ఇంక అంత భక్తి చూపును నీ పైన శ్రీ ఆంజనేయుడు…!!కొలు!!

శివ శివాయని  భక్తులనుచుంటే….
రామ రామా అని హనుమ అనుచుంటే…
వీనులకు విందయ్య హరిహరుల నామము…
మా కనులకు పండగయ్య మీ దివ్య రూపము…
శివునితో మమేకమైన నిన్నుగాంచి…
జన్మలు అడగవా వరములను చేయి చాచి…!!కొలు!!

పాహిమాం పాహిమాం…. రామలింగేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం కాళలింగేశ్వర రక్ష మాం…

Leave a Comment

Scroll to Top