అపర దయామయా…శివా.. శివశంకరా….

అపర దయామయా…శివా.. శివశంకరా….
అసమాన తేజోమయా…హరా..అభయంకరా..
జోహారు జోహారు ఫణి భూషణా….
కోటిన్నొక్క పదహారు దండాలు నీకు శశి భూషణా…!!అపర!!

కరిగి పోతావయ్యా కరుణించమనిన…
కుదుట పడలేవయ్య బాధలను వినిన….
కష్టమనిన తుడిచేవు కన్నీళ్లను….
ఎంతోటి కష్టమైనా మోసేవు కడగండ్లను…
అల కైలాస శిఖరాన కొలువుండు స్వామి…
ఇల మా మదిన నివసించ దయచూపవేమీ…!!అపర!!

నిను కనిన పిదప మారేను విధిరాతలు…
నిను కొలిచినంత పొంగేను సిరుల జలపాతాలు…
ఆరాధనా హృదయాలలో ఆశీనుడవుతువు….
అడగకనే వరమిచ్చి దయాగుణ శీలుడవుతువు….
అభిషేక ప్రియునివై అలరారు స్వామి…
అత్యంత వైభవముల సేవలను అందుకో స్వామి…!!అపర!!

పాహిమాం… పాహిమాం… పరమేశ్వర పాహిమాం రక్షమాం..రక్షమాం సర్వేశ్వర రక్షమాం…

Leave a Comment

Scroll to Top