మాతా…శైలపుత్రీ…
జగన్మాతా…సుమధుర గాత్రి…
అమ్మా…బంగారు బొమ్మా…
మాయమ్మా…కనక దుర్గమ్మా…
కనబడవే మా కలన కాత్యాయనీ…
అడుగిడవే మా మదిన శివ కామినీ…!!మా!!
ముత్యాల ముక్కెరకు మెరుపొచ్చె కానవే…
రతనాల పట్టెడలు వెలుగులీనెను చూడవే..
పద్నాల్గు భువనాలు పాలించు రాణీ…
నిను వర్ణించగల వాడొక్కడే మా పినాకపాణీ
జగజ్జననీ…జంగముని హృదయేశ్వరీ…
జై భవానీ… జయమమ్మ జగదీశ్వరీ…!!మా!!
పావనమౌ ప్రతి జన్మ నీ చరణాలు తాకిన…
నందనవనమౌ ప్రతి ఇల్లు నిను కొలుచుచుండిన….
అనురాగ మధురిమల కౌముదీ రావే…
ఆనంద నయన చంద్రిక లతో వచ్చి దీవించి పోవే…
శాంకరీ…శ్రీశైల భ్రమరాంబికా…
కరుణించవే…కొల్లూరు మూకాంబికా…!!మా!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరీ పాహిమాం…రక్ష మాం…రక్ష మాం..సర్వేశ్వరీ రక్ష మాం…