కానరా…కనులతో గోవిందుని…

కానరా…కనులతో గోవిందుని…
ప్రార్ధించరా మనసుతో సాంబశివుని…
చూచేను నీ కనులు లక్ష్మి పతిని…
కొలిచేను నీ మనసు గౌరి పతిని…
ఐక్యమై ఉన్నారు ఒకరికొకరు…
సమైక్యతను చాటుతూ వున్నారు వారిద్దరూ…!!కా!!

మహాకాళ మందిరము మహా విష్ణువు నిలయమాయే…
ఉజ్జయినీ పురము కైలాస,వైకుంఠముల కలబోతలాయే…
కాలు మోపిన ఇపుడు ఉజ్జయిని లోన….
నీవు రెండు లోకాలలో అడుగిడినట్లుండు ఏకబిగిన…
జాగు సేయక బిర బిరా తరలిరండు…
ఝాము జారే లోపు భక్తితో కొలవరండు…!!కా!!

శంకరా…అనిపిలువు పలికేను గోవిందుడు…
కేశవా…అని పిలువు స్పందించు సాంబశివుడు…
పేరులే వేరు ఆత్మలొకటే వారికి…
రూపులే వేరు హృదయమొకటే వారికి….
గుణమన్నదీ ఒక్కటే కరుణించడం…
లక్ష్యమన్నదీ ఒక్కటే కాపాడడం…!!కా!!

పాహిమాం ..పాహిమాం…శివ కేశావాయా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…హరి హరాయా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top