పండుగాయె మా కనులకు కాశీపతి…

పండుగాయె మా కనులకు కాశీపతి…
వెండి వెన్నెలొచ్చే మా మదికి గౌరీపతి….
ఆనంద సంద్రాలు ఉవ్వెత్తున ఎగసే నిను కనిన పిదప…
కైలాస గిరులందు చూస్తున్నట్లు వుందంది నా కంటి పాప…!!పండు!!

అహో ఆదిదేవా…దర్శించుకొమ్మని వరమిస్తివా…
ప్రభో శంభుదేవా…ప్రార్ధించుకొమ్మని కరుణిస్తివా…
అందుకో నా మనసు కృతజ్ఞతల విందు….
ప్రార్ధించ నిలుచుంటి పుష్పాలతో నేను నీ ముందు….
శివా…ఇదే వొరవడిని కొనసాగించుమయ్యా…
ఓ హరా…నిను వీడి నేనెటువైపు వెళ్ళనయ్య….!!పండు!!

లోతు తెలియని భక్తేదో లోన దాగున్నది…
అంతు బట్టని ఆర్తేదో బయట పడకున్నది…
స్పందనల ప్రకంపనలు ఏర్పడును నిను గాంచినపుడు….
ఓంకార శబ్ద నాదాలు వినిపించు నిను తలచినపుడు…
చెప్పగలవారెవరు స్పందనల భక్తి లోతులని….
లెక్క పెట్టగలవారెవరు అంతు చిక్కని ఆర్తి సంపదలని…!!పండు!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం….రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top