అడ్డబొట్టూ సామి… పలుకవేమి…

అడ్డబొట్టూ సామి… పలుకవేమి…
విభూది నామాల సామీ..నీవు ఉలకవేమి….
పలుకనంటే ఎట్టయ్య శంకరయ్య…
నీ మీద ఒట్టయ్య నీవే దిక్కయ్య…!!అడ్డ!!

తెచ్చాను చూడు మారేడు దళములు…
తెచ్చి పెట్టాను చూడు పాల కడవళ్ళు….
చేశాను నీకు మూడు ప్రదక్షిణలు…
ఒక్క వరమిస్తె నీకు వేల దండాలు…
చేయించుకో నా చేత బిల్వ దళ పూజలు…
జరిపించుకో పాల కడవల అభిషేకముల సేవలు…!!అడ్డ!!

చేసుకుంటూ పోతాను నీ పూజలు…
 వ్రాసుకుంటూ పోతాను నీ పాటలు…
తలచుకుంటూ వుంటాను నీ లీలలు…
తెలుసుకుంటూ వుంటాను నీ మాయలు…
తృప్తినిస్తే నీకు నే చేయు సేవలు…
శంకరా… కలపకుందువా నీవు నాతోటి మాటలు…!!అడ్డ!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం..సర్వేశ్వరా రక్ష మాం….

Leave a Comment

Scroll to Top