అపర్ణా పతి దర్శనం…అత్యద్భుతం…

అపర్ణా పతి దర్శనం…అత్యద్భుతం…
విశాలాక్షీ పతి వీక్షణం…పరమాద్భుతం….
విరి సిరుల నడుమ విశ్వేశ్వరుండు..
మారేడు దళ నిధుల మధ్య మహేశ్వరుండు….
అలరారే కదా శివుడు అవని కావ….
మదిన కదలాడే కదా హరుడు మనని బ్రోవ….!!అపర్ణా!!

తేరండి పుష్పాల ఫల సిరుల బుట్టలు….
సమర్పించగ రండి…రారండి పాలు పాయసముల పసిడిపాత్రలు…
ప్రేమతో అందుకొను పరమ శివుడు…
నీవు భక్తితో అర్పించితే సాంబశివుడు….
నిష్కల్మష నైవేద్యములకు సంతసించు…
నిజ భక్తి గుణ శీలతకు తాను  పరవశించు..!!అపర్ణా!!

ఆరగించిన శంకరుడు ఊరుకోడు…
ఆపత్కాలమున నిన్ను ఆదుకుంటాడు…
పరవశించిన హరుడు నిను మరచిపోడు…
పరమేశ్వరా…అని పిలువు పలుకుతాడు…
ఇష్టపడి దీవించు దీనులను శివుడు…
బహు కష్టపడి పాలించు బ్రహ్మాండమ్ము నతడు…!!అపర్ణా!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top