ఓం నమః శివాయ నమః
అంజనీ సుత శ్రీ ఆంజనేయ…
శ్రీ రామ ప్రియ భక్తాంజనేయా…
పొందినావయ్య దివ్య వరమును…
చేరి కాళేశ్వరుని హృదయ పురమును…
అందుకొన రావయ్యా మారుతీ…ఈ దీప కాంతుల దివ్య హారతి…!!అంజనీ!!
మధురమైనది రామ నామము…
రమణీయమైనది రామచరితము….
ఆ రామ నామము ప్రాణమై….
ఆ చరితలో ఒక భాగమై…
ఘనత కెక్కిన వానరా….నీ సాటి ఎవరిక లేరురా…!!అంజనీ!!
రామ పాదము చెంతనే…
నీ స్థానమని అనుకుంటివే…
ఆ స్వామి సేవల చింతనే…
నీ లోకమని అనుకుంటివే…
స్వామి భక్తి సేవకూ చిహ్నమైతివి జగతిలో….
ఆ పుణ్యమూర్తి కరుణతో దైవమతివి పుడమిలో…!!అంజనీ!!
పాహిమాం….పాహిమాం… అంజనీసుత పాహిమాం…
రక్షమాం…రక్షమాం…వీరాంజనేయ రక్షమాం…