ఓం నమః శివాయ నమః
వినిపింతు శంకరా…నా మనో వేదనను…
మనసు మాట వినని ఈ బుద్ధి తీరు తెన్నునూ…
వలదు వలదనిననూ బుద్ధి తగని పని చేస్తుంటే…
మనసు కలత చెందుచున్నది…మాట వినను విననని ఆ బుద్ధి చెబుతుంటే…!!విని!!
నలిగి పోతుంటి శంకరా…ఈ రెంటి నట్ట నడుమన….
నేను కుమిలి పోతుంటి శంకరా..కన్నీటి ఏటి గట్టున…
నీ పైనే భారమేసి మోకరిల్లినానయా..
పంచేంద్రియముల నప్పజెప్పి శిరము వొంచినానయా….!!విని!!
మనసావాచా నిను నేను కోరునొక్కటే…
ఈ మహీతలము పై నేనునూ నీ పరమ భక్తుడగునొక్కటే…
ప్రతి క్షణమూ నువ్వు గురుతొచ్చు వరమివ్వరా…
అనుక్షణమూ నను నేను తెలుసుకొన తలపు నీవవ్వరా…
పరిమళములనే ఇచ్చేటి నీ పద పూజ సుమమునై…
సకల మానవాళి మెచ్చుకునే శివుని కరుణ ఋజువునై…
వెలుగొందితే చాలు నీ గుడి వాకిట దివ్వెలా…
సేవించ సిద్ధమటుల వేచి వుండనిస్తే చాలు సదా నీ ముందు నందిలా…!!విని!!
పాహిమాం….పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్ష మాం…