ఒకే ఒక్క విన్నపం…

ఓం నమః శివాయ నమః 

ఒకే ఒక్క విన్నపం…
దర్శించుకొననివ్వు శంకరా…నిను ప్రతి దినం…
ఒకే ఒక వ్యాపకం…
కావాలి స్మరియించ నిను ప్రతి క్షణం..
చాలయ్య చాలు ఈ రెండు వరములు….
దయతలచితే తరియించిపోవా మా జన్మలు…!! ఒకే!!

శుద్ధి లేనివి శంకరా…మా జన్మలు..
ఆత్మ శుద్దే లేనివి ఈ తనువులు..
పునీతమవుటకు నీ సేవలో…
జన్మచరితార్ధమవుటకు నీ తలపులో….
అర్పించుచున్నాను నా మనసును…
సమర్పించు చున్నాను ఈ జన్మను…!! ఒకే!!

చేయాలని పించేను నీ పూజలు..
భక్తితో నిర్వహించాలనిపించేను నీ సేవలు…
ఈద లేనట్టి ఈ సంసార సాగరమును వీడి…
వీలు కల్పించనట్టి బ్రతుకు పోరాటము నుండి…
బయట పడలేక వున్నాను పరమేశ్వరా…
లీనమవలేక వున్నాను నీ తలపులో కాళేశ్వరా…!! ఒకే!!

పాహిమాం..పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top