ఓం నమః శివాయ నమః
జగన్నాటక సూత్ర ధారివీ నీవేనయా….
జగన్నాథుని పాత్ర ధారివీ నీవేనయా….
కొలిచెమయా శంకరా…నిను మనసుతో…
తిలకించేమయా పూరీ క్షేత్ర వాసునిగా నిను కనులతో…
పూరీ జగన్నాథ పాహిమాం…పాహిమాం…
కాశీ విశ్వ నాధరక్ష మాం…రక్షమాం..!!జగ!!
వైభవముగ జరిగాయి రథయాత్రలు పూరీ నగర పురవీధిలో…
మిక్కిలి వైభవముగ జరిగాయి పూజలు జగన్నాథునికి నీ ఆలయములో….
ఆ పరంధాముని దర్శించుకొన వరమిచ్చావు పరమేశ్వరా…
పూరీ క్షేత్రమునకు వెళ్ళ లేని వారిని తిలకించమని జగదీశ్వర….!!జగ!!
భక్తులకు ఏ పరీక్షలు పెట్టక వరమిచ్చువాడు శివుడని…
అశక్తులకు ఎట్టి స్థితిలో నైనా అభయ మిచ్చువాడు నారాయణుడని…
కొలిచేరు భువిలోన జనులందరూ ఒక్కటై….
వారు పలికేరు… హరి హరులు ఇద్దరూ మాకు రెండు కళ్ళంటూ ఏకమై…!!జగ!!
పాహిమాం…పాహిమాం..పూరీ జగన్నాథ పాహిమాం….
రక్షమాం…రక్షమాం…కాశీ విశ్వ నాధ రక్షమాం….