శంభో హరా శంకరా….
గంగాధరా…సుందరా…
జగతినుద్ధరింప
జగజ్జేయమానముగా కాంతు లీనుతున్న జగదీశ్వర…
విశిష్టాలంకారమున విశ్వతేజమై వెలుగొందుతున్న విశ్వేశ్వర…
తగుదురయ్యా ఎవరైన..నిను వర్ణింప ఈ భూతలముపైన……..
విరచించగలవారెవరైన కలరా.. పరమాధ్బుతమైన నీ రూపమును గని ఈ పుడమి పైన…
జయహో…అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా జయహో…
జయ జయహో…ఖండ ఖండాతరమున వెలసి
కనుచూపుతో పాలించు పరిపాలకా జయ జయహో…!!శంభో!!
ఏమందుము… ఏమందుము…నీ దివ్యాలంకార శోభని….
ఏ విధమందున కీర్తింతుము నీ సుందరా కార రూపుని…
సాష్టాంగ పడి ప్రణామములు చేయడమే తెలుసు ఈ తనువుకి…
మనో నేత్రములతో నిను గాంచి ప్రార్థించడమే తెలిసిన ఈ మనసుకి…!!శంభో!!
తల్లీ.పార్వతీ..కనరమ్మా..కనరమ్
సుందరాకృతిన నేడు అలరారే మా పశుపతి…
రావమ్మా శాంభవి… వేగిరముగ….తీయంగ శివునికి నీ వామ హస్తముతో దిష్టి చుక్కల హారతి…
దివి సీమ నుండి దిగి వత్తురంట దేవతలు ఎందరెందరో….
నీ మది సీమనేలు మాహేశ్వరుని కనగ కదలి వత్తురంట కానుకలతో భక్తులెందరో….
పరికించితే చాలమ్మ మనసార నీ పెనిమిటిని ఒక్కసారి….
దాసుడై పోతాడు దయార్ద్ర హృదయుడై భక్తులందరికీ తలచిన ప్రతి ఒక్కసారి…
చేరుకొన రావమ్మా…పరమేశ్వరుని తో కలిసి దీవించ మమ్ముల…
చేరుకొని కరుణించితే చెప్పుకొనమా తల్లి… మీ కృపా కటాక్షముల చరితను ఏడేడు జన్మల…!!శంభో!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం.. సర్వేశ్వరా రక్ష మాం..