వందే విష్ణుం…శివ మానసం..

ఓం నమః శివాయ నమః

వందే విష్ణుం…శివ మానసం..
నమ: పార్వతీ పతిం..హరి సంతసం..
శంభో మహాదేవ నారాయణం…
సదా మీ నామమే మాకు పారాయణం…
నమో ఆదిదేవా నమస్తే…నమస్తే..
నమో మహా దేవా నమస్తే…నమస్తే..!!వందే!!

ముక్తి దాయకం…పరమేశ్వరం శివం..
మోక్ష ప్రదాయకం…మురారి స్వరూపం…
శివకేశవ సాన్నిహిత్యం….ఆచరణీయం సదా…
హరి హరుల నామ గానం..చిరస్మరణీయం కదా …
నమో ఆది దేవా…నమస్తే..నమస్తే
నమో మహాదేవ…నమస్తే…నమస్తే..

అపూర్వ దృశ్యమిది శంకరా…
ప్రశస్త సమయమున కానగా…
ప్రభాతమున పరమేశ్వరా…
పరమాద్భుత వరమిది నిను వేడగా…
చలించని మనసుతో నీ చరణాలు తాకనీ…
తదేకముగ నిను గాంచుతూ మనసార నిను కొలవనీ…
నమస్తే…ఆది దేవా…నమస్తే..నమస్తే..
నమో మహా దేవా…నమస్తే నమస్తే..!!వందే!!

పాహిమాం… పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్ష మాం..!!వందే!!

Leave a Comment

Scroll to Top