పరీక్షించకయా శంకరా…పరిపూర్ణులము కాము.

ఓం నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

పరీక్షించకయా శంకరా…పరిపూర్ణులము కాము.
ఉపేక్షించకయా వరమియ్య…శక్తిహీనులము మేము..
మా తప్పు తెలుసుకొన ఆశగా నీ ఎదుట నిరీక్షించేము..
శలవిస్తే పునరావృతము కాకుండా సమీక్షించేము..!!పరీక్షంచకయా!!

అదుపు తప్పిన ఇంద్రియాలు ఆధిపత్యము చెలాయిస్తువుంటే…
మతి తప్పి మానవత్వము విచక్షణా రహితముగా ప్రవర్తిస్తువుంటే…
మిన్నకుండిపోతున్నాము నిలువరించ శక్తిలేక….
వేడుకొన వచ్చాము పోరాడ వాటితో…ఈ మనోవేదన భరించలేక…!!పరీక్షించకయా!!

బానిసలవుతున్నాము బంధాలకి…
జూదరులవుతున్నాము మోహాలకి..
వ్యామోహాల వ్యసనాల వలలోన చిక్కి….
పర్యవసాన స్థితులెరుగక ఏడ్చేస్తూ వెక్కి వెక్కి….
ఇంకి పోయిన కన్నీటి కళ్ళతో..
మొరపెట్టుకున్నాము నీ గుడి వాకిళ్ళతో…
తెరవమని నీ మది మందిర ద్వారములను…
నీ సుమనసుకి తెలుపుకొని సేద తీర మా దీన గాధలను…!!పరీక్షించకయా!!

పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం..
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా... రక్షమాం…

Leave a Comment

Scroll to Top