అక్షర తృతీయ శుభ దినము నాడు…

ఓం నమశ్శివాయనమ:🙏🙏🙏

అక్షర తృతీయ శుభ దినము నాడు…
అరుదెంచి నాడమ్మ అమ్మోరిలా హరుడు…
శ్రీ శాంకరీ రూపమై…
భ్రమరాంబికా భావమై…
సాక్షాత్కరించి  సాంబశివుడు
వేడుకొమ్మన్నాడు  అమ్మగా తనని..
చూసుకోమన్నాడు మాత గా తనలోన మనని…

కనవమ్మ జననీ…సురలోక పావనీ…
మా దీన వేదనలు వినవమ్మ తరుణీ…
దుర్గాభవానీ…శంభో శివానీ…
కడుపులో దాచుకొని మమ్ము కాపాడవమ్మ కాత్యాయనీ…
తల్లడిల్లే బిడ్డ వేదనను తెలుసుకోగలది తల్లియే కదా తల్లీ…
అల్లకల్లోలమయ్యే అవని వేదన
 నీకు తెలియగరాలేదా కల్పవల్లీ…
రావమ్మ జననీ…అంతుచిక్కని దుష్ట శక్తుల అంతమొందింపగా ఆదిశక్తివై భువి పైకి మళ్ళీ…
ఏప్రాణి కోటికీ హాని కలిగించక చేయమ్మ రాకుండా ఏ అద్రుశ్య శక్తి పుడమి పై మళ్ళీ..మళ్ళీ..

దుర్గాభవానీ పాహిమామ్..
కనకదుర్గా భవానీ రక్షమామ్.. 

Leave a Comment

Scroll to Top