తప్పక వరమిచ్చే శంకరుడు దయామయుడు…

తప్పక వరమిచ్చే శంకరుడు దయామయుడు…
అతి చప్పున దీవించే ఈశ్వరుడు మహా ఘనుడు…
ఆలసించకుండ నీవు మానవా…
భక్తి భావాలతో పలుకు నీవు శివ శివా…
కరుణ చూపు సత్వరము సాంబడు…
ముక్తి మార్గమ్మును చూపు నీకు శంభుడు ..!! త!!

కోటి మంది కోరికలు కోరినా…
శతకోటి మంది దీవెనలు అడిగినా…
ఓర్పుతోటి వరములను ఇచ్చురా…
ఓదార్పు తోటి బాధలను తీర్చురా…
వెన్నలాంటి మనసు సాంబ శివునిది…
కన్న తండ్రి లాంటి ప్రేమ పరమ శివునిది….!!త!!

దీపమెట్టి వెతకడంట భక్తులని…
శివుడు పసిగట్టును దీన కనుల ఆర్తులని….
కనుల నీరు తుడిచి కానుకిచ్చుర…
కంటి పాప లాగ మనని తాను చూచురా…
మరచిపోర మానవా…బంధు మిత్రులు …
శివుని తలచుకుంటూ బ్రతికిపోరా పగలు రాత్రులు…!!త!!

 పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top