నారాయణం భజే…నారాయణం..
రుచికరం గోవింద పారాయణం…
కానరే లింగాన కేశవుని రూపం…
వెలిగించరే కర్పూర హారతుల దీపం…
నారాయణం… శ్రీమన్నారాయణం…
నాగశయనా…సేవించు భక్తి మకరందం…!!
పాలకడలీ వాసా… ఓ పరంధామా…
పారిజాతపు పూజలు నువ్వందుకొనుమా…
కోటి పుణ్యాల నిధి వాసా… ఓ సుగుణ ధామా…
తులసి దళ సేవలను చేయించుకొనుమా…
నియమించి నన్నొక్క ద్వారపాలకునిగా…
శ్రీహరీ…గుర్తించు నన్ను నీ ప్రథమ సేవకునిగా…!!నా!!
లక్ష్మీవల్లభా…లలిత లావణ్య రూపా..
ఓం నమో కౌస్తుభా..కుసుమ కోమల స్వరూపా…
ముక్కోటి దేవతలు నిను కొలుచు వేళలో..
ముక్కంటి నిను తలచి ధ్యానించు వేళలో…
చూడనీ నీ విశ్వమోహనాకారరూపము…
నను పలుకనీ నీ స్తోత్ర రత్నావళి కావ్యము…!!నా!!
పాహిమాం…నారాయణా రూపా శంకరా పాహిమాం…రక్ష మాం..రక్షమామ్..శివ విష్ణు రూపాయ రక్ష మాం…