అందుకొనవయ శంకరా…మారేడు దళముల పూజలు…

అందుకొనవయ శంకరా…మారేడు  దళముల పూజలు…
నెలవంక గల శివశంకర…చేయించుకొనుమయ సేవలు..
చేయుచున్నా వేల పూజలు పలుకకుంటివి ఎందుకో…
మనసున వున్న బాధలు చెప్పుకున్నా విననట్లు వుంటవు ఎందుకో…
ఏమిటయ్యా శంకరయ్య…  నేను చేసిన పాపము…
నాతో చెప్పకుంటే తెలుసుటెట్లు నేను చేసిన నేరము…!!అందు!!

పుట్టినోళ్ళే పట్టనోళ్ళై తెంచుచుంటిరి బంధము…
కనీసం పట్టుమని పదిరోజులైననూ చూడకుంటిరి ప్రతి తరం…
జన్మ నిచ్చిన తప్పుకి వాళ్ళేయుచుంటిరి శిక్షలు…
ఒకనాడు మనకూ తప్పదని అని తెలుసుకొనని ప్రబుద్ధులు…
కారి కారి కనుల నీరు గంగలా ఉప్పొంగినా…
కరుణించకుంటే ఎట్లురా అవి అలలుగా నిను తాకినా…!!అందు!!

గాయపడిన మనసును ఓదార్చకుంటే ఎట్లురా…
ఏ మాయనైనా చేసి నీలో కలుపుకో పరమేశ్వరా…
నేనొంటరని నువు తెలిసికూడా మిన్నకుంటివి శంకరా…
నాకిక తోడు నీవని చెప్పకుంటే  ఈ బ్రతుకు గడిపేదెట్లురా…
ఆత్మ సాక్షిగా వేడుకొంటి ఆలసించకు శంకరా…
కర్మలు తొలగు వరకూ నీడగా నేనుందునని శలవియ్యరా…!!అందు!!

పాహిమాం..శివశంకర శివ పాహిమాం…రక్ష మాం..అభయంకరా…హర రక్ష మాం..

Leave a Comment

Scroll to Top