కాళేశ్వరా… ఇదె గైకొనుము కవితాంజలి…

కాళేశ్వరా… ఇదె గైకొనుము కవితాంజలి…
సూర్యనారాయణుడర్పించు అక్షర పుష్పాంజలి…
అందుకో  ఈ నా భక్తి గీతాంజలి…
అంది పుచ్చుకో నా కనుల భాష్పాంజలి…!!కా!!

శంకరా…నీమంచి మనసు కిదే హృదయాంజలి…
ఈశ్వరా…నీ ప్రేమగుణముకిదే పద్యంజలి…
తరగని చెరగని నీ యశసుకిదే కుసుమాంజలి…
పదనర్తనల పాదాలకిదే రమ్య  నాట్యంజలి..!!కా!!

దీవించు నీ కరములకు దీపాంజలి…
కరుణించు ఆ నేత్రములకు ధూపాంజలి…
భక్త జన బంధూ అందుకో భక్త్యంజలి…
దీన జన ప్రేమికా నీకిదే నమస్సుమాంజలి…!!కా!!

పాహిమాం….పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రాక్షమామ్..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top