దక్షిణ ముఖ లింగమా…
దయచూడుమా…
దాక్షాయణి ప్రియతమా…
దీవించుమా…
మహా కాళా…మంత్రాలు వల్లింతునయ్యా…
కోటి సాయంత్రాలు నిను కొలువు వరము నాకివ్వవయ్యా…!! ద!!
అదిగదిగో పిలిచె ఆ పూల వనములు నన్ను…
నీ చరణాల తమనుంచమని వేడుకొనె నన్ను…
ఇదిగిదిగో రమ్మంటూ పిలిచె ఆ ఫలములు నన్ను…
నీకు నైవేద్యముగ తమనర్పించమని అర్తించె నన్ను….
పువ్విస్తునన్నది తన కొచ్చే పుణ్యములలో నాకు కొంత…
ఫలమిచ్చునన్నది తనకొచ్చే దీవెనలలో కోరుకున్నంత…!! ద!!
పరమేశ్వరా…పాదాక్రాంతమై పోదా ప్రకృతి దాసోహమనుచూ….
సర్వేశ్వరా…సాగిల పడిపోక పోదా సృష్టి సర్వస్వము శిరమొంచుచూ…
మహిమాన్వితమైన నీ రూపు గని మంత్రాలు చదువును…
మహా కాళేశ్వరునివి నీవని భస్మ అభిషేకములు చేయును….
గణ గణా గంటలు.. ఢమ ఢమల నాదాలు మిన్నంటుతుంటే…
మాకు దక్కవా పుణ్యాలు గుడిలోన కూర్చోని చక్కగా నీవు దీవిస్తువుంటే…!! ద!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్షామాం…సర్వేశ్వరా రక్షమాం…