విరచించగలనా శంకరా…

విరచించగలనా శంకరా…
నిను నేను కీర్తించగలనా ఈశ్వరా…
అసమాన సౌందర్య రూపమున నువ్వున్నచో…..
అత్యంత వైభవముగ నీవు వెలుగొందుచున్నచో…
మౌన ముని గాక నేను ఏమవుతును…
స్థాణువయ్యాక నేనెటుల విరచింతును…!!విర!!

చాలవేమో ఎన్నైన గ్రంథాలయాలు…
రాసుంచ నీ మహిమల గ్రంథ నిధులు…
ఇస్తువేమో ఎన్నెన్నో కరుణ సిరులు…
మాచెంత లేవయ్య దాచుంచ అన్ని హృదయాలయాలు..
దీనబంధూ…ఆసనము చేసుకో నా మనసును…
కరుణ సింధూ… కొలువుండి పోతివా నిను నేను మరువలేను..!!విర!!

ఎనలేని భక్తి నిధులనందించగలను…
కనబడని నా మనసు నర్పించగలను…
ఎదలోన నీ గుడిని నిర్మించగలను…
తుదిలేని సేవలను నే చేయగలను..
ఫణి భూషణా…నీ పద్యగ్రంథములు వ్రాయ నేనెంత వాడినీ…
కరుణవదనా…..కాస్తంత చోటిస్తే నీ చరణాల పడివుండువాడిని…!!విర!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా...పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top