ఓం ఓం ఓం గణపతి..
ఇదె వందనమయ గణపతి…
గం గం గం గణపతి..
జయ గంగాధర గణపతి…
మనసారా కొలిచితి…
కావుమయ్య గణపతి…!!ఓం!!
శంభు తనయ గణపతి…
శర్వాణి పుత్ర గణపతి….
కలవు నీవు గణపతి…
మా కలవు నీవు గణపతి…
తోడు నీవు గణపతి….
మా అండ నీవు గణపతి…
జై జై జై గణపతి.. జై బోలేగా గణపతి…!!ఓం!!
శివుని కొలుచు గణపతి…
శివునాజ్ఞ తీర్చు గణపతి…
యశస్సు నీవే గణపతి….
మా ఉషస్సు నీవే గణపతి…
సూక్ష్మ కనుల గణపతి…
శుభ ఫలితమిచ్చు గణపతి…
జై జై జై గణపతి…. జయములివ్వు గణపతి…
గంగాధర గణపతి…హే గౌరీ సుత గణపతి….!!ఓం!!
పాహి పాహి గణపతి…పాహి పరమేశ్వర గణపతి…రక్ష రక్ష గణపతి….సర్వ రక్షాకర గణపతి