రప్పించుకుంటివి నీ గుడికి ఇంకొక్కసారి…
కాళేశ్వరా…మమ్ము రప్పించుకోవా నీవు మరియొక్కసారి…
ఆనతిస్తే వస్తాము ఎన్ని సార్లైనా…
శంకరా…నీవు చెప్పనిస్తే చెబుతాను ఎన్ని కృతజ్ఞతలనైన…!! ర!!
అడుగులేస్తూ వడి వడిగా నడచి వస్తి…
“జై మహా కాళా” అని తలచుకుంటూ గబ గబా కదలి వస్తి..
ఆనతిచ్చావు కూర్చొనగ గుడిలోన నీ ముందర…
మనసార నిను కాననిచ్చావు నాపైన నీకెంత ప్రేమరా…
కనులు పెద్దవిగ చేసుకొని కంటి ముక్కంటి…
మనసులో దండాలు పెడుతూ నా గుండెలో నిను దాచుకొంటి…!! ర!!
నీకర్పించితే ఈ నిరుపేద ఓ చిన్నికానుక…
శివా… స్వీకరిస్తివి కదా..ఇది ఏ పాటి కానుకనక…
సమర్పించితే మనసుతో నమ:శ్శివాయ మంత్రాల పద మాలిక…
శివా… పరవశిస్తివి కదా…నాకిచ్చుచూ దీవెనల వరమాలిక…
కాళేశ్వరా..అంతుబట్టని బంధముతో ముడి వేస్తివి…
మహా కాళేశ్వరా…నేనెంత వాడినని నన్నింత కరుణిస్తివి…!! ర!!
పాహిమాం…పాహిమాం…కాళేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం..శ్రీ మహా కాళేశ్వరా..రక్షమాం…