పోయిరా గణపతీ మంచుకొండకి….
మళ్ళిరా గణపతి చవితి పండక్కి…
చెప్పరా నువ్వెళ్ళి పార్వతమ్మకి….
వేల సంబరాలు జరిపారని శంభు పత్నికి…
గణా గణా గణేశా పోయిరారా ఇంటికి…
వచ్చి పోతువుండవయ్య మళ్ళీ మళ్ళీ పుడమికి…!! పో!!
మా కోర్కెలు తీర్చమని కోరి కోరి కొలిచాము…
నీ దయనే పొంద దలచి గుంజీలు తీసినాము…
నీ పూజలు చేసి మేము ప్రసాదాలు పంచినాము…
కోట్లాది భక్తులకు అన్నదానం చేసినాము….
గణా గణా గణేశా నీ పండగంటే ఇష్టము….
నీకు నవరాత్రులు జరుపుతుంటే తెలియదయ్య కష్టము….!! పో!!
రంగ రంగ వైభవంగా నీ యాత్రను జరిపినాము….
గంగ తల్లి ఒడిన చేర్చి నిమజ్జనం చేసినాము…
వీడ్కోలు తెలిపినాము చెమ్మ కనులతో…
నిన్ను వదిలి ఇంటికొచ్చాము గుండె బరువుతో….
గణా గణా గణేశా…క్షేమంగా వెళ్ళిరా….
గంగ గౌరీ శివునితో ఇచ్చటి ముచ్చట్లను తెలుపరా…!! పో!!
పాహిమాం…పాహిమాం..గణనాథా పాహిమాం….రక్షమాం….రక్షమాం.