శంకరా…కొమ్మ కొమ్మనూ కోరాను పూలిమ్మనీ….
భక్తితో నీ చరణాల నుంచాలనీ…
ఏరు నడిగాను నాకు నీరిమ్మని…
నీకు ఆర్తితో అభిషేకములు చేయాలని….
పూలిచ్చి ఆ కొమ్మ పుణ్యమొందె….
నీరిచ్చి ఆ ఏరు ధన్యమొందె…
నేనిచ్చినది ఏముంది నీ పూజకు….
భక్తితో నీ చరణాల నుంచాలనీ…
ఏరు నడిగాను నాకు నీరిమ్మని…
నీకు ఆర్తితో అభిషేకములు చేయాలని….
పూలిచ్చి ఆ కొమ్మ పుణ్యమొందె….
నీరిచ్చి ఆ ఏరు ధన్యమొందె…
నేనిచ్చినది ఏముంది నీ పూజకు….
మనసిస్తమంటే మలినమాయే నీ సేవకు…!!శంకరా!!
తొలగించుమా ఇకనైన పాపాలను…
పూయించుమా ఇపుడైన భక్తి కుసుమాలను…
నిర్మించుమా హృదయాన నీ గుడులను…
వెలిగించుమా వెంటనే జ్ఞాన దీపాలను…
పరమ పావనమైన నీ స్మరణ చేయాలనుంది…..
నీ సేవ చేయుచూ బ్రతుకు గడపాలని ఉంది…..!!శంకరా!!
నిష్టతో పూజిస్త నిటలాక్ష నిన్ను….
మనో నిష్ఠతో ధ్యానిస్త పరమాత్మ నిన్ను….
ఇష్టముగ భావించు భక్తునిగా నన్ను…
సుస్పష్టముగ చూపేను నాలోన నిన్ను….
ఈశ్వరా…చూడరా ఒకసారి నా కనుల వైపు….
నడిపించేవు నన్నింక నీ శిఖరాల వైపు…!!శంకరా!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…
తొలగించుమా ఇకనైన పాపాలను…
పూయించుమా ఇపుడైన భక్తి కుసుమాలను…
నిర్మించుమా హృదయాన నీ గుడులను…
వెలిగించుమా వెంటనే జ్ఞాన దీపాలను…
పరమ పావనమైన నీ స్మరణ చేయాలనుంది…..
నీ సేవ చేయుచూ బ్రతుకు గడపాలని ఉంది…..!!శంకరా!!
నిష్టతో పూజిస్త నిటలాక్ష నిన్ను….
మనో నిష్ఠతో ధ్యానిస్త పరమాత్మ నిన్ను….
ఇష్టముగ భావించు భక్తునిగా నన్ను…
సుస్పష్టముగ చూపేను నాలోన నిన్ను….
ఈశ్వరా…చూడరా ఒకసారి నా కనుల వైపు….
నడిపించేవు నన్నింక నీ శిఖరాల వైపు…!!శంకరా!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…