శ్రావణ మాసం…

శ్రావణ మాసం…
శివా…నీ దయ కోసం….
అతివలు అర్థించిరయ్య ఆదిశంకరా…
తమని కాపాడమని కోరిరయ్య పార్వతీశ్వరా….
రక్షా బంధనము కట్టి నమస్కరించిరి…
నీ పాదములను తాకి వారు వేడుకుంటిరి….!!శ్రా!!

మనిషి మారుచిండె క్రూర మృగముగా….
తన విజ్ఞతనే మరచి వింత పశువుగా….
అన్నెం పున్నెం ఎరుగని పడతుల చెరబట్టి….
లేత పసిపాపల భవితవ్యానికి చావు రాసిపెట్టి….
నిర్దయగా తిరుగుతున్న దుష్టుల హతమార్చమని…
నిర్భయముగా జరుగుతున్న దుర దృష్ట క్రీడ లాపమని….
వేడుకుంటిరయ్యా నీ పాదములను పట్టి…
నీకు నమస్కరించిరయ్యా రక్షా బంధనమును కట్టి….!!శ్రా!!

లోక ప్రక్షాళనము చేయ నీవు వేగ రారా శంకరా….
దుష్ట దుర్మార్గుల పీతమణచ నీవు కదలిరారా ఈశ్వరా….
మహిళల మనుగడకు ముప్పు లేకుండగ చూడరా….
ఈ మగువల బంగారు కలల పంట పండించగ తరలిరా…
ఏ స్త్రీ మూర్తికీ కంటనీరు రాకుండగ చూడు….
ముక్కంటి..నిను కోరుచుంటి మా అబలలకు నీవు తండ్రై కాపాడు….!!శ్రా!!

పాహిమాం..పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top