లింగ స్వరూపమా….
శంకరుని ప్రతి రూపమా….
జంగమ నామధేయమా….
సజ్జనుల ప్రాణప్రదమా…
తెలుసుకుంటిని తుదకు నీవే నా తండ్రని….
వేడుకుంటిని ఇక నాకు నీవే దిక్కని…!!లింగ!!
పరిగెత్తి పరుగెత్తి అలసిపోయాను…
జీవన సమరాన నేనైతే ఓడిపోయాను….
విసుగెత్తి విసుగెత్తి వడలి పోయాను…
చుక్క నీరైన తగనట్టి కడలి నయ్యాను…
విశ్వాస పాత్రుడుగ నేనుందునయ్యా….
విశ్వేశ్వరా…నీ దరికి నను చేర్చుకోవయ్యా….!!లింగ!!
ఎంత పెద్దదో కదా ఆకాశము….
చెప్పగల వారెవరు దాని వైశాల్యము….
అట్లాగే ఎంత గొప్పదో కదా నీ మానసం….
అణువంత చోటివ్వచ్చు కదా శివా నా కోసము…
పశ్చాత్తాపము చెంది వేడుకొనుచుంటిని….
నీ పూజ పత్రి పుష్పముగా నన్ను భావించమంటిని…!!లింగ!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్షమాం..రక్షమాం..