ఎవరికీ కానవు…
ఏమడిగినా ఇస్తవు….
ఎంతకీ పలుకవు…
మము రేయి పవలు కాస్తవు…
నీ లీలలు తెలియకుందిరా శంకరా…
నీ మహిమలు అర్థమవవురా పరమేశ్వరా…!!ఎవరికీ!!
తెలుసుకుంటినయ్యా నా జన్మ తీరుని….
నేను మార్చుకుందునయ్యా నా బ్రతుకు తీరుని….
పలుకుచుంటినయ్యా పంచాక్షరాలని…
నేను నింపుకుంటినయ్యా మది నిండ భక్తిని….
ఈశా…నీ మౌనం మా ప్రశ్నకు బదులవునా….
నేను మౌనంగా ధ్యానిస్తును కనిపించుము చప్పున….!!ఎవరికీ!!
తెలుసుకొనుట కష్టము నీ రూపు రేఖలు…
నిన్ను కొలుచుకొనుట ఇష్టము ముందుంచి పువ్వులు…
చెప్పుకొనక తప్పక మా కష్ట సుఖములు….
నీతో పంచుకుందుమయ్యా మా ఈతిబాధలు…
ఈశా…మా ప్రాణం నీ చేతుల్లో ఉందిరా….
నీవు కరుణిస్తే నీ కోసం మళ్ళీ పుడతామురా…!!ఎవరికి!!
పాహిమాం..పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం…