కోరరా కోరికలు భక్త జనులు….

కోరరా కోరికలు భక్త జనులు….
అడగవా దీవెనలు ఆ ఆర్తి కనులు…
చేయరా పూజలను రేయి పవలు…
అందివ్వవా నీ చేయి శరణననిన.. దీనులు…
శంకరా…అమిత భక్తిని చూపెదము ఇవ్వయ్య వరము….
అసమాన జప తపములు చేసేము కరుణించు క్షణము….!!కోర!!

నందిపై వెళ్ళేవు కట్టుకొని గజచర్మము….
వేగముగ అంగలే వేసేవు పట్టుకొని త్రిశూలము….
వేయుచుంటే నీవు ఒక్కొక్క అడుగు….
భూమాత తరలొచ్చి గంగతో నీ కాళ్ళు కడుగు…
చూడలేరయ్యా ఎవ్వరూ నీ రూపము…
చూడగలరయ్య లింగమున నీ ప్రతి రూపము….!! కో!!

అనంత లోకాలు నీకు హారతులు పట్టు…
పదునాల్గు భువనాలు నీకు కానుకలు పెట్టు….
సప్త సంద్రములు నీకు గజ్జెలను కట్టు….
కొండ కోనలు నీకు గొడుగులను పట్టు….
వాగు వంకలు నీకు వాహనమును కట్టు….
వంది మాగదులు నీకు జేజేలు కొట్టు….
సృష్టి యావత్తూ నీకు దాసోహమయ్యా…
అందులో అణువంతయే మేము…మమ్ము  కరుణించవయ్యా…!!కోర!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top