వెన్న తిన రావయ్యా చిన్ని కన్నయ్యా….
మా ఉట్టి దోచుక పోవయ్య నల్లనయ్యా….
నీ అడుగుల సవ్వడి విన వేచివున్నాము….
నీ పాద ముద్రలను చూడ ఎదురు చూచుచున్నాము…
చిన్నికృష్ణా…తరలిరా నీ నేస్తాలతో…
ముద్దుకృష్ణా ….తినిపించరా నీ ప్రేమ హస్తాలతో…!!వెన్న!!
దొంగవని అంటారు నిన్నందరూ…
మనసులు దోచుకుంటావని అంటారు మరి కొందరు…
మాయ చేస్తాడంటారు ఊరందరూ…
తన మత్తులో ముంచేస్తాడనంటారు ఇంకొందరు….
గోపికా రమణా…నీ లీల లెరుగంగ ఎవరి తరము….
దేవకీ నందనా…నీ ప్రతి చర్య వెనుకుంది పరమార్థము…!! వెన్న!!
రధసారధివయ్యావు రణరంగమందు….
గీత బోధించావు యుద్ధ సమయమందు….
ధర్మ సూత్రములు తెలిపి కుంతి పుత్రునికి….
ధర్మ మార్గము చూపావు సకల లోకాలకి….
విశ్వరూపము జూపి విశ్వమును ఆవరించి…
దుర్మార్గమును అణచావు కృష్ణునిగా అవతరించి….!!వెన్న!!
పాహిమాం…పాహిమాం….పరమేశ్వరా పాహిమాం…నా చేత కృష్ణ గీతం వ్రాయించావు శివా నీకు వందనం….